నేహా చౌదరికి రెమ్యూనరేషన్ రోజుకి నలభై వేలా!
on Oct 3, 2022
నేహా చౌదరి గుర్తుందా?.. బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన మూడవ కంటెస్టెంట్. ఈమె తిరుపతిలో 11 సెప్టెంబర్ 1993లో జన్మించింది. ఈమె స్పోర్ట్స్ విమెన్, స్విమ్మర్ మరియు యోగా ట్రైనర్. ఈమె 2012లో ప్రొఫెషనల్ కెరియర్ స్టార్ట్ చేసింది. మొదట 'గూగుల్' కంపెనీలో పని చేసింది. కొంత కాలానికి ఆ జాబ్ మానేసి, టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టింది. ఈమె న్యూస్ రీడర్ గా పలు ఛానల్స్ లో పని చేసింది. ఆ తర్వాత 'మా మ్యూజిక్' లో యాంకర్ గా చేసింది. తనకి చిన్నప్పటి నుండి ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేసిందంట. అందుకే ఇప్పుడు తనకి నచ్చిన రంగంలో పనిచేస్తూ రాణిస్తోంది. తను 'రిథమిక్ జిమ్నాస్టిక్' లో నేషనల్ లెవల్ గోల్డ్ మెడలిస్ట్. ప్రస్తుతం తను 'ఐపీఎల్' లో విమెన్ రిప్రెజెంటర్ గా చేస్తోంది. తనకి మంచి వాక్చాతుర్యం కలదు.
బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన ఈ భామ, ఎక్కువ రోజులు హౌస్ లో నిలదోక్కుకోలేకపోయింది. గేమ్ లో ఫోకస్ గానే ఆడినా అభిమానులని ఎక్కువగా మెప్పించలేకపోయింది. హౌస్ లో ఉన్నన్ని రోజులు ఎక్కువగా గొడవల్లో కనిపించేది. దీంతో హౌస్ లో వాళ్ళకి నచ్చలేదు. చూసే ప్రేక్షకులకు సైతం చిరాకుగా అనిపించింది. నామినేషన్ లో నువ్వా? నేనా? అంటూ గొడవలకు దిగేది. ఎంతలా అంటే హౌస్ మేట్స్, తనతో మాట్లాడటానికి కూడా ఆలోచించేట్టు చేసేది. హౌస్ లో ఎక్కువగా రేవంత్ తో గొడవ కొనసాగేది. అయితే హౌస్ మేట్స్ లో కీర్తి భట్, మెరీనా, సుదీప వాళ్ళని తన ఫ్యామిలీ మెంబెర్స్ గా భావించిందంట. హౌస్ నుండి మూడవ వారమే బయటకొచ్చింది. "బయటికి రావడం నాకు షాకింగ్ గా ఉంది" అంటూ నాగార్జునతో స్టేజి మీదనే చెప్పేసింది. నాగార్జున హౌస్ లో "దమ్మున్న వాళ్ళు ఎవరు? ఫేక్ వాళ్ళు ఎవరు?" అని అడగగా కొంతమంది పేర్లు చెప్పింది. "నేను ఎలిమినేట్ కావడానికి మాత్రం రేవంత్ కారణం" అని షాకింగ్ కామెంట్స్ చేసి బయటకొచ్చింది.
ఇదిలా ఉంటే నేహాకి బిగ్ బాస్ లో రెమ్యూనరేషన్ రోజుకి నలభై వేల వరకూ ఉంటుందని బయట ప్రచారంలో ఉంది. అయితే నేహా హౌస్ నుండి బయటకొచ్చాక ఒక ఇంటర్వ్యూలో తనని రెమ్యూనరేషన్ గురించి అడుగగా, "నాకు అంత ఏమీ ఇవ్వలేదు" అంటూ చెప్పుకొచ్చింది.
Also Read